సిర్పూర్(టి) నుంచి కాగజ్‌నగర్ వైపు వెళ్తున్న లారీ రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం రోడ్డు పక్కకు పడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ సంఘటనతో కొద్దిసేపు రవాణాకు అంతరాయం ఏర్పడింది.