లంబాడిగూడ పరిసరాల్లో పులి సంచారం- డప్పు చాటింపు

బెజ్జూరు మండలం సలుగుపల్లి, లంబాడిగూడ అటవీ పరిసరాల్లో పులి సంచారం ఎక్కువగా గుర్తించిన నేపథ్యంలో, మంగళవారం ఉదయం లంబాడిగూడ గ్రామపంచాయతీ డప్పు చాటింపు ద్వారా ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. గ్రామస్థులు అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, పత్తి తీసేవారు తప్పనిసరిగా గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామపంచాయతీ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్