ఉపాధ్యాయుల హక్కులు సాధించాలంటే టీఎస్ యూటీఎఫ్ తోనే సాధ్యమని జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి తెలిపారు. శుక్రవారం పెంచికలపేట్ మండలంలోని పలు స్కూళ్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులపై పని భారం తగ్గించాలని, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఏడాది మొత్తం వేతనం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.