వీరయ్య కుటుంబానికి రూ. 5 లక్షల భీమా చెక్కు అందజేత

కాగజ్‌నగర్ సర్సిల్క్ కాలనీకి చెందిన కనుకుంట్ల వీరయ్య మృతి చెందిన నేపథ్యంలో, చేనేత బీమా పథకం కింద ఆయన భార్య నామిని గంగకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. బెజ్జూర్ చేనేత సహకార సంఘంలో 35 ఏళ్లుగా పనిచేసిన వీరయ్య కుటుంబానికి ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నల్ల కనకయ్య, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్