కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డులో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభలో పాల్గొనేందుకు ముందుగానే కాగజ్‌నగర్‌కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. సభ విజయవంతానికి చేపట్టిన ఏర్పాట్లపై నేతలు సమీక్షించి, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.