రాబోయేది ఎర్రజెండాయే.. సీపీఎం నేత భూపాల్

ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సీపీఎం విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండా మాత్రమేనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్మిక, కర్షక వ్యతిరేకమని విమర్శించారు. లేబర్ కోడ్లు రద్దు, రైతులకు మద్దతు ధర, యువతకు ఉపాధి కల్పన కోసం ప్రజలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఎర్రజెండాను గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్