కొమరంభీం: గూడెం రోడ్డు మరమ్మత్తులు ఎప్పుడు..?

చింతలమానేపల్లి–కర్జవెళ్లి–గూడెం రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాలు తగ్గినా ఇప్పటికీ రోడ్డు మరమ్మత్తులు ప్రారంభించలేదు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రూ. 50 లక్షలు, ఎమ్మెల్సీ దండే విఠల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ప్రజలకు ప్రోసిడింగ్ కాపీ చూపించాలని, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టంగా చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్