గుడ్లబోరి గ్రామంలో మద్యం విక్రయాలపై మహిళల కఠిన నిర్ణయం

కౌటాల మండలానికి చెందిన గుడ్లబోరి గ్రామంలో శుక్రవారం మహిళలు మద్యం విక్రయాలపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని, లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయాలు జరగాలని వారు తీర్మానించారు. బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని, ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గ్రామ అభివృద్ధి, కుటుంబ శాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మహిళలు తెలిపారు.

సంబంధిత పోస్ట్