సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుడికి ప్రమాదం

కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో శనివారం ప్రమాదం జరిగింది. సర్దార్ బస్తికి చెందిన నాగరాజు అనే కార్మికుడు విధులు నిర్వహిస్తుండగా, కంప్రెషర్ టెంపరేచర్ తగ్గించే క్రమంలో ఫ్యాన్‌లో ఇరుక్కుపోయాడు. మెయింటేనెన్స్‌లో ఉన్న మరో కార్మికుడు గమనించి వెంటనే అతన్ని పక్కకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. నాగరాజుకు స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్