కాగజ్‌నగర్‌: 'కస్తూర్బా టీచర్లకు పని భారం తగ్గించాలి'

కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి కోరారు. గురువారం కాగజ్‌నగర్‌ మండలంలోని పలు పాఠశాలల్లో సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జీవో 317 ద్వారా ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, తాత్కాలిక ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం అందించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్