ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం- అడవీలో ప్లాస్టిక్ డ్రైవ్

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని, పెద్దబండ అటవీ ప్రాంతంలోని భీమన్నగుడి వద్ద, నీటి కుంటల వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎఫ్‌డీవో అప్పయ్య భక్తులకు ప్లాస్టిక్ వ్యర్థాలను అక్కడే వదిలివేయకుండా తమతో పాటు తీసుకెళ్లి డంప్ యార్డ్ లేదా చెత్త ట్రాక్టర్‌లో వేయాలని సూచించారు. ప్లాస్టిక్ వల్ల వన్యప్రాణులకు ముప్పు ఉందని, అగ్నిప్రమాదాలు నివారించేందుకు వంటనిప్పు పూర్తిగా ఆర్పివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్