ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు.. సెల్ టవర్ ఎక్కిన యువకుడు

బెజ్జూర్ మండలంలోని మద్దిగూడ గ్రామానికి చెందిన 22 ఏళ్ల కోర్తే కిష్టయ్య, సులుగుపల్లి గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని, వారి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ శుక్రవారం సులుగుపల్లి గ్రామం వద్ద సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషా అక్కడికి చేరుకుని, యువకుడికి నచ్చజెప్పి, అతన్ని సెల్ టవర్ పై నుండి సురక్షితంగా కిందికి దించారు.

సంబంధిత పోస్ట్