కాగజ్‌నగర్‌: అంబేడ్కర్ విగ్రహం ఎదుట యువతుల నృత్యాలు

కాగజ్‌నగర్‌లోని అంబేడ్కర్ చౌక్ వద్ద సోమవారం అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికలో చిన్నారుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, యువ నాయకులు ఫణి తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్