ఏఐసీసీ పరిధికి చేరిన కొండా సురేఖ వివాదం!

TG: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా చర్యల వేడి రాజుకుంది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం పార్టీ నిబంధనలను అతిక్రమించి, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని అధిష్టానం దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు నివేదిక సమర్పించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు. ఆమెపై పార్టీ పరంగా లేదా మంత్రివర్గంలో ఎలాంటి చర్యలుంటాయనే దానిపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్