TG: BJP నేతలు జై శ్రీరాం అంటే పైనుంచి డబ్బులు వస్తాయా అంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ BJP మండిపడింది. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కాదని.. దైవద్రోహ శాఖ మంత్రి అని ఫైరయింది. జై శ్రీరామ్ నినాదాన్ని పైసలతో పోల్చుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరిచారని తెలిపింది. వెంటనే హిందువులకు మంత్రి క్షమాపణలు చెప్పాలని కమలం నేతలు డిమాండ్ చేస్తున్నారు.