‘గబ్బర్ సింగ్’లో శ్రుతిహాసన్ తండ్రిగా నటించారు కోట శ్రీనివాసరావు. ఆ పాత్ర కోసం గాయకుడిగానూ మారారు. ‘మందు బాబులం’ పాట మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పవన్; అలీతో కలిసి స్టెప్‌లేశారు. ఆయన గొంతు సవరించి పాడిన ఆ పాటతో పాటే భాగ్యలక్ష్మీ(శృతిహాసన్) తండ్రి క్యారెక్టర్ కూడా హిట్ అయింది. ఇప్పటికీ కొన్ని ఫంక్షన్లలో, మందు పార్టీల్లో ఆ పాట పెట్టుకుని యూత్ ఎంజాయ్ చేస్తారు.