కోటా మరణం చాలా బాధాకరం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఇవాళ హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కోటా భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటా విలక్షణ నటుడని, మానవతావాది అని అన్నారు. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారన్నారు.

సంబంధిత పోస్ట్