తెలుగు సినిమా ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణంపై నటుడు రాజేంద్రప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అజరామరమైన నటుడని ఆయన అన్నారు. "కోటగారి నటనా విశ్వరూపం తలుచుకుంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. ఆయన నటన, సమయపాలన, పాత్రలోని లోతును అందుకునే తీరు అత్యద్భుతం. కోటగారి స్థానం ఎవరు భర్తీ చేయలేరు" అని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.