విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు నటనలో ఎంతగా పేరొచ్చిందో.. వ్యక్తిగత జీవితంలో అన్ని కష్టాలు ఆయనను వెంటాడాయి. 1973లో ఆయన భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె తల్లి చనిపోయారు. దీంతో షాక్‌కు గురైన తన భార్య మానసిక సమస్యతో 30ఏళ్లు తనను గుర్తుపట్టలేదని కోట సన్నిహితులకు చెప్పుకుని బాధపడేవారట. ఓ ప్రమాదంలో కోట కూతురు కాలు కోల్పోయింది. కొన్నాళ్లకు ఆమెకు పెళ్లి జరిగిందని సంతోషించేలోపే 2010లో కొడుకు మరణం ఆయనను మరింత కుంగదీసింది.