దివంగత నటుడు కోట శ్రీనివాసరావుతో తన అనుబంధంపై ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోట తనకు ఎప్పుడూ పోటీ కాదని, సినిమాల్లో తనకంటే గొప్ప నటుడని అన్నారు. కొందరు తమ మధ్య పోటీ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారని, అది కోటను బాధించిందని తెలిపారు. ఒకసారి కోట స్వయంగా తన ఇంటికి వచ్చి ఓ పాత్ర చేయవద్దని కోరిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. రంగస్థలంపై ఇద్దరికీ మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, సినీరంగంలో కోట శ్రీనివాసరావు అసాధారణ నటుడని భరణి ప్రశంసించారు.