కోట శ్రీనివాసరావు సినీ, రాజకీయాల్లోనూ రాణించారు. ఆయన తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కావాలని అనుకున్నా నాటకాల్లో అడుగు పెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగింది. ఈయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకులో పని చేసేవారు. 1999-2004 వరకు బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1966లో రుక్మిణితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.