‘చనిపోయేంతవరకూ నటిస్తా’ అని కోట నాతో చెప్పారు: పవన్ (వీడియో)

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. “ఆయన మరణవార్త విని చాలా బాధ కలిగింది. ఎంతో ఇష్టమైన వ్యక్తి. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కలిసి నటించాం. షూటింగ్‌లో ‘చనిపోయేంతవరకూ నటిస్తా’ అన్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. బాబు మోహన్‌తో ఆయన చేసిన సినిమాలు అద్భుతం. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే గొప్ప నటుడు కోట గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అన్నారు.

సంబంధిత పోస్ట్