హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం 12వ జాతీయ గోండి (కోయ) భాషా ప్రామాణీకరణ వర్క్‌షాప్ కరపత్రాన్ని ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్యలు ఆవిష్కరించారు. గోండి (కోయ) భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చేందుకు కృషి చేయాలని జారె పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి 6 వరకు భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్లో జరిగే వర్క్‌షాప్‌ను విజయవంతం చేయాలని కోరారు.