రాజుపేట బ్రిడ్జి వద్ద సైడ్ డైవర్షన్ ఏర్పాటు చేయాలి

ములకలపల్లి మండలం రాజుపేట వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో పాల్వంచ – దమ్మపేట - మందలపల్లి ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ములకలపల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదాల పునరావృతిని నివారించేందుకు రాజుపేట బ్రిడ్జి వద్ద తక్షణమే సైడ్ డైవర్షన్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ తాత్కాలిక మార్గం కల్పించడంతో పాటు కూలిన బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕