రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

అశ్వారావుపేట మండలంలోని ఆసుపాకకు చెందిన రాములమ్మ(45) టీవీఎస్ వాహనంపై గ్రామాల్లో కూరగాయలు విక్రయిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆమె ఆసుపాక నుంచి నందిపాడుకు వెళ్తుండగా గాడ్రాల సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో స్పృహ తప్పి పడి పోయింది. ఆ మార్గంలో వెళ్లే కూలీలు గమనించి ఆమెను అశ్వారావుపేటలోని ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించేలోపే మృతి చెందింది. రాములమ్మ అంత్యక్రియలు చిన్న కుమార్తె స్రవంతి నిర్వహించింది.

సంబంధిత పోస్ట్