అన్నపురెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం రైతు వేదిక వద్ద రైతు సంక్షేమ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు బ్యాంకింగ్, సహకార సంఘాల సేవలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. సంఘ అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావు, డీసీసీబీ చండ్రుగొండ మేనేజర్ ప్రశన్న ప్రియ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి ఈ సదస్సులో పాల్గొన్నారు. రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.