అశ్వారావుపేట: యువతి చదువుకు బాబు మోహన్ భరోసా

అశ్వారావుపేటకు చెందిన యువతి చదువుకు ప్రముఖ నటుడు బాబు మోహన్ భరోసానిస్తూ ముందుకు వచ్చారు. మండలంలోని బండారిగుంపునకు చెందిన బైట గోపాలరావు రెండో కుమార్తె సమీప బీటెక్ పూర్తి చేసింది. ఎంటెక్ చదవడానికి బాబు మోహన్ ముందుకు వచ్చి తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద చదువు పూర్తి చేయిస్తానని మంగళవారం హామీనిచ్చారు. చదువు పూర్తిచేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆయనకు తెలిపింది.

సంబంధిత పోస్ట్