అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గాడ్రాల గ్రామానికి చెందిన జడ్డి అరవింద్ ఆదివారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు.