అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పంచాయతీలో శుక్రవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ కోర్సా రాజేష్ ఆధ్వర్యంలో అర్హులైన మహిళలకు చీరలు అందజేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి పథకాలు అమలు చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని సర్పంచ్ తెలిపారు.