విద్యుత్ ఆర్టిజన్ల విలీనం..సమాన వేతనం కోసం ధర్నా

విద్యుత్ ఆర్టిజన్లను కార్పొరేషన్లో విలీనం చేసి, సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టివిఏఈజెఏసి ఆధ్వర్యంలో సోమవారం అశ్వారావుపేట సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని కార్మికులు నినదించారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఏప్రిల్ 2న కొత్తగూడెంలో, 7న వరంగల్ సీఎండీ కార్యాలయం వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్