అశ్వారావుపేట: ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి

అశ్వారావుపేటలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి శనివారం పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతంలో హాస్పిటల్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వైద్య సేవలు మెరుగుపడలేదని ఆయన ఆరోపించారు. సరైన వైద్యం అందక దూర ప్రాంతాలకు వెళ్లేసరికి ప్రమాద బాధితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్