అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కీలక అంశాలపై ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు సిద్ధమని ప్రకటించినా, విపక్ష సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాక్షేత్రంలో అద్భుతమైన పాలన అందిస్తున్న ప్రభుత్వంపై బురదజల్లడం మానుకోవాలని జారే ఆదినారాయణ అన్నారు.