అశ్వారావుపేట: క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే

గోవాలో జరిగిన ఎసీఎఫ్ఎ జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ బాలుర జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ జట్టులో జిల్లాకు చెందిన జి. విష్ణువర్ధన్, వై. రిషివర్మలు తమ అద్భుత ప్రతిభతో రాణించారు. విజేతలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేకంగా అభినందించి, క్రీడాకారులతో పాటు కోచ్ కొమరం వెంకటనారాయణను ఘనంగా సత్కరించారు. స్వతహాగా పీఈటీ అయిన ఎమ్మెల్యే క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్