అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వినూత్న పద్ధతుల్లో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గురువారం ఆయన బస్తీల్లో పర్యటిస్తూ, ఒక ఇంట్లో మహిళలకు సాయంగా అంట్లు తోమి, మరోచోట కూరగాయలు కోస్తూ సామాన్యుడిలా కలిసిపోయారు. రాజకీయ చైతన్యం పెంచడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న ఈ విభిన్న ప్రచారం నియోజకవర్గంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.