అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దూసుకుపోతున్నారు. బుధవారం 1వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించి, కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా స్థానిక హోటల్కు వెళ్లిన ఎమ్మెల్యే, స్వయంగా దోశలు వేసి అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.