అశ్వారావుపేట: మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి

అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పాటులో క్రియాశీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ, ఈసారి కూడా దానిని కైవసం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశమైన ఆయన, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనపై స్వల్పకాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్