అశ్వారావుపేట మండలం వినాయకపురంలో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మండల అధ్యక్షుడు వెంకన్నబాబు నేతృత్వంలో కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు.