అశ్వారావుపేట: స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్

గురువారం అశ్వారావుపేట మండలంలోని మామిళ్ళవారిగూడెం వినాయకపురం వద్ద ఒక ప్రైవేట్ స్కూల్ బస్సును ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొట్టాడు. మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ బస్సును ఢీకొట్టడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంతో బస్సులోని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్