అశ్వరావు పేట నియోజకవర్గంలోని వేలేరుపాడు శివారులోని మల్లారం గ్రామంలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన పద్దం మేరీ అనే మహిళకు అశ్వరావు పేటకు చెందిన యు.టి.ఎం పౌండేషన్ సభ్యులు అండగా నిలిచారు. గురువారం నిత్యవసర వస్తువులు, బట్టలు, వంట సామగ్రి, బియ్యం, కూరగాయలు అందజేసినట్లు పౌండేషన్ వ్యవస్థపకుడు పాయం స్టీవెన్ దొర తెలిపారు.