అశ్వరావుపేట: ఈనెల 12న ఆవిర్భావ వేడుకలు

ఈనెల 12న రావులపాలెం సీఆర్సీ క్లబ్ లో జరగనున్న కొబ్బరి అభివృద్ధి బోర్డు 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని రైతు సంఘం నాయకులు తుంబూరు మహేశ్వర రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్యలు శుక్రవారం పిలుపునిచ్చారు. అశ్వారావుపేట మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వేడుకల్లో అధికారులు, నిపుణులు పాల్గొని కొబ్బరి సాంకేతిక సహకారం, సలహాలు అందించే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్