అశ్వరావుపేట మండలంలో "ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక" పేరిట అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని గ్రామస్థులు, పెద్దలు అంటున్నారు. అనంతరం గ్రామ ఇసుక రీచ్‌ల నుంచి జేసీబీలు ఉపయోగించి ట్రాక్టర్లతో వందల ట్రిప్పులు ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. ఒక బడా నేత ఆశీర్వాదంతో జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.