భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదలకు కూలిన వంతెన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని మూకమామిడి పంచాయతీ పరిధి మొగరాలగుప్ప గ్రామంలో గురువారం మురసు తుపాను ప్రభావంతో భారీ వరద సంభవించింది. మూకమామిడి ప్రాజెక్టు నుంచి వాగులోకి వచ్చిన నీటి ఉధృతికి మొగరాలగుప్ప–మూకమామిడి గ్రామాలను కలిపే వంతెన పూర్తిగా కూలిపోయింది. వరదలో కొట్టుకుపోయిన భారీ వృక్షాల వల్ల వంతెన దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్థులు బయటకు వెళ్లలేని దయనీయ స్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕