చండ్రుగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకాలకు అనతి కాలంలోనే అత్యధిక నిధులు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.