చండ్రుగొండ: పేకాట స్థావరంపై పోలీసులు దాడి

చండ్రుగొండ మండలంలోని గుర్రాయిగూడెం అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా, పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. మరో తొమ్మిదిమంది పరారయ్యారు. వీరి నుంచి రూ. 42,460 నగదు, సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చండ్రుగొండ ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్