చంద్రుగొండ: తరగతి గదులు లేక ఆరుబయటే విద్యార్థుల అవస్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం వెంకటియ తండ MPUPS పాఠశాల పరిస్తితి అధ్వానంగా మారి ఏ ఒక్క విద్యార్థికి కూడా సక్రమమైన విద్య అందడం లేదు. ఆ పాఠశాలలో 1 వ తరగతి నుంచి 7 వ తరగతి వరకు తరగతులు నిర్వహించబడుతున్నాయి. కానీ పిల్లలకు ఉన్నది 3 గదులు మాత్రమే. పాఠశాల ప్రాంగణంలో ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని వేరే చోటకు మార్చి ఇకనైన పాఠశాల బిల్డింగును మరలా పాఠశాలకే కేటాయించాలని విద్యార్థి సంఘాలు సంబంధిత అధికారులను హెచ్చరిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్