మురుసు తుఫాన్ దెబ్బకు దమ్మపేటలో వరి పంట నాశనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో మురుసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. గురువారం,  కురిసిన భారీ వర్షాలకు మండలవ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగి తీవ్రంగా దెబ్బతింది. చేతికి వచ్చిన పంట కళ్లముందే నీటిపాలవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు నష్టపోయామని, ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕