దమ్మపేటలో బుధవారం రోడ్డు ఇరుపక్కలా 500 నోట్ల కట్టలు పడి ఉండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ఆ ముఠా సభ్యులే భయంతో ఈ నోట్లను చెరువులో పడవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలపై విచారణ కొనసాగుతోంది.