దమ్మపేట: అంబులెన్స్ లో ప్రసవం

దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామానికి చెందిన తోట సత్య వేణికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా, నల్లకుంట గ్రామ శివారులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈఎంటీ కల్లూరి రాజేష్, ఆశావర్కర్ వైద్య సేవలు అందించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, వారిని దమ్మపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్