దమ్మపేట: బాలిక మిస్సింగ్ కేస్ నమోదు

దమ్మపేటలోని నాచారం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అదృశ్యంపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన బాలిక, ఈ నెల 3న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్