దమ్మపేట మండలంలో సోమవారం ముష్టిబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి వస్తుండగా, అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు గద్దల నాగబాబు (39)ను ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.